Home / Telugu / Telugu Bible / Web / Psalms

 

Psalms, Chapter 113

  
1. యెహోవాను స్తుతించుడి యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి.
  
2. ఇది మొదలుకొని యెల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక.
  
3. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది.
  
4. యెహోవా అన్యజనులందరియెదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి యున్నది
  
5. ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహో వాను పోలియున్నవాడెవడు?
  
6. ఆయన భూమ్యాకాశములను వంగిచూడననుగ్రహించు చున్నాడు.
  
7. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై
  
8. ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు
  
9. ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి.