Home / Telugu / Telugu Bible / Web / Psalms

 

Psalms, Chapter 121

  
1. కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును?
  
2. యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
  
3. ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.
  
4. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
  
5. యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.
  
6. పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు.
  
7. ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును
  
8. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును