Home / Telugu / Telugu Bible / Web / Psalms

 

Psalms, Chapter 122

  
1. యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.
  
2. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి
  
3. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు
  
4. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్లును.
  
5. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి యున్నవి.
  
6. యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
  
7. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక.
  
8. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమి త్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును.
  
9. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించెదను.