Home / Telugu / Telugu Bible / Web / Psalms

 

Psalms, Chapter 150

  
1. యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి.
  
2. ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములనుబట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమునుబట్టి ఆయనను స్తుతించుడి.
  
3. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.
  
4. తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.
  
5. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.
  
6. సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.